ఓ వేసవి మధ్యానపువేల నే కలుసుకున్నా నా తీయని నేస్తాన్ని...
నాకిష్టమైన నా నేస్తాన్ని .........
ఎలాంటి ఇష్టం అంటే???
నీలి నింగి అంటే నాకిష్టం....
వర్షించే మేఘం అంటే నాకిష్టం...........
వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టి వాసన అంటే నాకిష్టం.......
వర్షం వెలిసాక కనిపించే ఇంద్రధనస్సు అంటే నాకిష్టం................
అరవిరిసిన మొగ్గలు అంటే నాకిష్టం...............
విరబూసిన పువ్వులు అంటే నాకిష్టం..........
పసిపాపల బోసి నవ్వులంటే నాకిష్టం...........
ఉవేతున ఎగసిపడే అలలంటే నాకిష్టం........
తడి ఇసుకతో కట్టే పిచ్చుకగుళ్ళు అంటే నాకిష్టం.........
గల గల పారే సెలఎరులంటే నాకిష్టం.................
పచ్చని చెట్లు అంటే నాకిష్టం........
పచ్చిక బయలు అంటే నాకిష్టం...............
వీటన్నికికన్న................
నవ్వే నీ కళ్లు అంటే ఇష్టం.........
ప్రేమ కురిపించే నీ చుపులంటే నాకిష్టం........
నన్ను పలికించే నీ తడి పెదవులు అంటే నాకిష్టం.........
మనస్పూర్తిగా నువ్వు మాట్లాడే మాటలు ఇష్టం..........
హృదయంతో నవ్వే నీ నవ్వంటే నాకిష్టం...............
నన్ను హత్తుకొని, భుజం తట్టి ధైర్యం చెప్పే నీ చేతులంటే నాకిష్టం.......
నీకంటే నన్నే ఎక్కువగా ఇష్టపడే నీ మనసంటే ఇంకా ఇంకా ఇష్టం......................
మొత్తానికి
నువ్వంటే చాలా చాలా ఇష్టం........
చెప్పలేనంత ishtam ..............
నీ
అను.